కన్నెపల్లి పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్

04-11-2026 | 07:06pm

కన్నెపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) బుధవారం సందర్శించి వైద్య సేవల నిర్వహణను పరిశీలించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, పూర్తయిన భోజనశాలను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంటశాల నిర్వహణ, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతు వేదికలో ఉపాధి హామీ పథకం క్రింద నిర్వహిస్తున్న వి బి జి రామ్ జి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి అందిస్తున్న అవగాహన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీనివాస్, సంబంధిత శాఖ అధికారులున్నారు.

మరిన్ని వార్తలు