కొలిమి కుంటలో ఇందిరమ్మ జీవిత బీమా
చొప్పదండి 20 నవంబర్ (విజయక్రాంతి): చొప్పదండి మండల(Choppadandi Mandal) కేంద్రంలోని కొలిమికుంట గ్రామపంచాయతీలో(Kolimikunta Grama Panchayat) ఇందిరమ్మ జీవిత బీమా(Indiramma Life Insurance) ను గ్రామ సర్పంచ్ చుక్కల తిరుపతి ఉపసర్పంచ్ బంజర లక్ష్మణ్ లు కలిసి ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కుటుంబానికి ఒక్కరు తప్పనిసరిగా ఇందిరమ్మ జీవిత బీమా ను చేసుకోవాలని కోరినారు ఈ జీవిత బీమా కోసం రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్(Ration Card, Aadhaar Card) ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి గ్రామపంచాయతీలో ఈనెలాఖరు వరకు చేసుకోగలరని తెలిపినారు.
ఈ జీవిత బీమా చేసుకోవడం వల్ల కుటుంబంలో ఎలాంటి అనుకోకుండా సంఘటనలు జరుగుతే కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు వర్తిస్తాయని తెలిపారు కాంగ్రెస్ మన ప్రభుత్వం చేస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని గ్రామ పాలకవర్గం కోరినారు ఈ కార్యక్రమంలో ప్రజలు వార్డ్ మెంబర్లు కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు