ఎమ్మెస్ఎఫ్ నూతన అధ్యక్షుడిగా గంగా నరేష్ నియామకం
కరీంనగర్ సిటీ నవంబర్ 22 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా కనకం గంగా నరేష్ మాదిగ నియమితులయ్యారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిసింది. నరేష్ బి.ఎ, జర్నలిజం పూర్తి చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు గంగా నరేష్ మాదిగ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా పెద్దలకు, నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చైతన్యం, నిర్మాణం, పోరాటం అనే నినాదంతో, సమ సమాజ స్థాపన కోసం, కులం లేని సమాజం కోసం, నూతన సమాజ నిర్మాణంకై కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు అప్పగించిన అరుదైన గొప్ప బాధ్యతలను మదిలో పెట్టుకుని, కరీంనగర్ జిల్లాలో ఎమ్మెస్ఎఫ్ ను క్రమశిక్షణతో మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలియజేశారు. నూతన అధ్యక్షుడికి పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.