బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం
22-11-2026 | 10:56am
బైక్పై వెళ్తుండగా మృత్యువు రూపంలో దూసుకొచ్చిన బస్సు!
శేరిలింగంపల్లి,నవంబర్ 22 (విజయక్రాంతి): మియాపూర్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Miyapur RTC Bus Accident) జరిగింది. యూనియన్ బ్యాంకు(Union Bank) సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి టీజీఎస్ఆర్టీసీ బస్సు కింద పడటంతో బస్సు వెనుక చక్రం తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.