భారీ పోలీస్ బందోబస్తు మధ్య మహేష్ అంత్యక్రియలు

22-11-2026 | 02:44pm

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీసుల భారీగా మోహరింపు..

తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శుక్రవారం హత్య గురైన చామకూరి మహేష్ అంత్యక్రియలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు(CI Upender Rao) ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. దీనితో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంత్యక్రియలో సుమారు 300 పోలీసులు విధి నిర్వహణ చేపట్టడం గమనార్వం.

మరిన్ని వార్తలు