దీపావళి కూడా పాయె!?
- నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం
- నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
- పెరుగుతున్న అసంతృప్తి
- మంత్రుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ
కరీంనగర్, నవంబర్ 16 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్(Congress) నేతల్లో నామినేటెడ్ పదవుల భర్తీపై(Filling of nominated posts) తీవ్ర ఉ త్కంఠ, సస్పెన్స్ కొనసాగుతోంది. దసరా, దీ పావళి పండుగల నాటికి ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, బోర్డుల చైర్మన్ పదవులు భర్తీ(Chairperson posts for corporations and boards filled) అవుతాయని ఆశావహులు ఎదురుచూసినప్పటికీ, తుది జాబితా విడుదల వాయిదా ప డుతూ వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యావహారాల ఇంచార్జి మారడంతో భర్తీ ఇప్పట్లో జరిగేనా అన్న సందేశాలు వ్యక్తం అవుతున్నా యి.
సుడా ( శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్(Social equations) పదవీకాలం ముగిసి వందరోజులు దాటింది. ఈ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. జి ల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్, అడ్లూరి ల చుట్టూ ఆశవాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన కొ ందరు సీనియర్ నేతలు గవర్నర్ కో టాలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు.‘ జి ల్లా గ్రంథాలయ సంస్థ కమిటీ సభ్యుల ని యామకాలు, మార్కెట్ కమిటీలు, ప్రముఖ దేవాలయాల పాలక మండళ్ల భర్తీ ఇంకా చాలా చోట్ల పెండింగ్లోనే ఉన్నాయి.
సామాజిక సమీకరణాలు: ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం, అలాగే కులగణన నివేదికల ఆధారంగా పదవుల కేటాయింపుపై కసరత్తు జరుగుతుండటం వల్లనామినేటెడ్ పోస్టుల ప్రక్రియ మరికొంత సమయం పెట్టె అవకాశం లేకపోలే దు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అ ధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలుమార్లు సమావేశమై దాదాపు 50 నుంచి 80 కార్పొరేషన్ల తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. , కేడర్లో అసంతృప్తి తగ్గించడానికి ఈ నెలాఖరులోగా లేదా శీతాకాల అ సెంబ్లీ సమావేశాల లోపు నామినేటెడ్ పదవుల ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పా ర్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.