15 మంది రౌడీ షీటర్లను బైండోవర్

25-11-2026 | 10:05pm

కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

కరీంనగర్ క్రైం, నవంబర్ 25 (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 15 మంది రౌడీ షీటర్లను బుధవారం బైండోవర్ చేయడం జరిగిందని సీపీ గౌష్ ఆలం(Karimnagar CP Goush Alam) ఒక ప్రకటనలో తెలిపారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ , అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్)  గౌస్ ఆలం ఎదుట వీరిని హాజరుపరచగా, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 126 నుండి 136 సెక్షన్ల ప్రకారం విచారణ జరిపి, ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో మెలుగుతామని ఒక లక్ష రూపాయలు పూచీకత్తుతో కూడిన బాండ్లను  రాయించుకోవడం జరిగిందన్నారు

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  గౌస్ ఆలం  మాట్లాడుతూ, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడినా, ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా పూచీకత్తు సొమ్మును జప్తు చేయడంతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు  తీసుకోబడతాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు