ప్రీ ప్రైమరీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

21-11-2026 | 03:10pm

లింగాల సురేష్ మహారాజ్

బెజ్జంకి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రీ ప్రైమరీ బోధకులు(Pre-Primary Staff), ఆయాలకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ(Dharma Samaj Party) మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల సురేష్ మహారాజ్(Lingala Suresh Maharaj) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యావంతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం చిన్నచూపు చూడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

నెలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, భవిష్య నిధి, వైద్య బీమా సౌకర్యాలతో పాటు 12 నెలల వేతనాలు, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు ధర్మ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు