రుణం ఇప్పిస్తానని మోసం...

18-11-2026 | 09:37pm

12 లక్షలు వసూలు చేసిన ప్రబుద్దుడు

కరీంనగర్ క్రైం, నవంబర్ 18 (విజయక్రాంతి): రుణాలు ఇప్పిస్తానని  ప్రచారం చేసుకుంటూ  నకిలీ డాక్యూమెంట్స్(Fake documents) క్రియేట్ చేసిన ఘరానా మోసగాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు(Karimnagar Rural Police) అరెస్ట్ చేశారు.పూర్తి వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వొడ్నాల జగన్ కూతురు వైష్ణవి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది.

ఇతరుల ద్వారా తన కూతురుకు పరిచయం అయిన సాయికృష్ణ రుణం ఇప్పిస్తానని జగన్ ను నమ్మించాడు. ఆరెపల్లి గ్రామ సర్వే నంబర్ 232|ఆ లోని 383.02 గజాల ఇంటి స్థలానికి రూ. కోటి 50 లక్షల రుణం ఇప్పిస్తానని  టాటా క్యాపిటల్ ఫైనాన్స్ నుండి రుణం మంజూరు అవుతుందని చెప్పాడు. 

దీనికోసం మొదటి విడుతగా రూ. 8.99 లక్షలు ఇన్సూరెన్స్ కోసం ఇవ్వాలని  ఆ తర్వాత లోన్, డాక్యూమెంట్స్ ప్రాసెసింగ్ కోసం అని రూ. రూ. 3.22 లక్షలు రెండో విడుత వసూలు చేసుకున్నాడు. అయితే రుణం మంజూరు అయినట్టుగా నకిలీ డాక్యూమెంట్స్ జగన్ కు అప్పగించాడు. ఈ డాక్యూమెంట్స్ తీసుకుని  ఫైనాన్స్ కు వెళ్లగా తమ బ్యాంకు నుండి వచ్చిన పేపర్లు కాదని ఫైనాన్స్ సిబ్బంది వెల్లడించారు.

దీంతో బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితుడు వేల్పుల సాయి కృష్ణ ను అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు