చైర్మన్గా రేవెల్లి.. వైస్ చైర్మన్గా రేమిడి
మానకొండూర్,(విజయక్రాంతి): మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Manakondur Agricultural Market Committee) చైర్మన్గా రంగపేటకు చెందిన రేవెల్లి రాజలింగయ్య, వైస్ చైర్మన్గా ఊటూరుకు చెందిన రేమిడి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీసీ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నియామకమైన తేదీ నుంచి రెండేళ్లపాటు వీరి పదవీకాలం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎర్రోళ్ల కవిత, తమిశెట్టి రాజేష్, రామినేని రామయ్య, కనకం అశోక్, రాపాక రాజేశ్వర్, కుంభం చిరంజీవి, కొత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల సంపత్ రెడ్డి, ముక్కెర సతీష్ కుమార్, ఏ. రామాంజనేయ, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీర కుమార్లను నియమించారు.
వీరితోపాటు జిల్లా మార్కెటింగ్ అధికారి, మానకొండూర్ సహకార సంఘం(Manakondur Cooperative Society) అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మానకొండూర్ ప్రథమ పౌరురాలు తాళ్లపల్లి వర్షిని గౌడ్ కూడా కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు. నూతన కమిటీ రైతుల సంక్షేమానికి, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.