కొత్తగట్టు టోల్ బాదుడు!
వరంగల్ కొత్త రోడ్డుపై వాహనదారులకు వాత
స్థానికులకు టోల్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్
హుజూరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారులకు టోల్ వాత పడుతోంది. కొత్తగట్టు టోల్‌ప్లాజా(Kothagattu Toll Plaza) వాహనదారులకు భారంగా మారింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు వద్ద ఈ నెల 15 నుంచి టోల్ వసూళ్లు ప్రారంభం కావడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. రహదారి పనులు పూర్తిస్థాయిలో ముగియకముందే వసూళ్లు చేపట్టడ ంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వాహనదారులపై అదనపు భారం
కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ. 160 వసూలు చేస్తున్నారు. భారీ వాహనాలకురూ.500 నుంచి రూ.1,020 వరకు టోల్ విధిస్తున్నారు. మరోవైపు కరీంనగర్ నుంచి వరం గల్, హన్మకొండ మార్గాల్లో వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి రూ.10 నుంచి రూ.30 వరకు టోల్ సెస్ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. మిగతా ఎక్కడా ఇంత భారీగా టోల్ లేదని వాహనదారులు మం డిపడుతున్నారు.
స్థానికులకు మినహాయింపు ఏదీ?
హుజూరాబాద్ నుంచి కేశవపట్నం, కొత్తగట్టు ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వారు కూడా టోల్ చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. హుజూరాబాద్ నుంచి కేశవపట్నం వెళ్లి తిరిగి రావడానికి రూ.320 ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమీప గ్రామ ప్రజలకు రాయితీ కల్పించాలి
సమీప గ్రా మాల ప్రజలు వ్యవసాయ, వ్యాపార, రోజువారీ పనుల కో సం ఇదే మార్గం లో ప్రయాణిస్తుంటారు. ప్రతిసారీ టోల్ చెల్లించడం ఆర్థిక భారంగా మారుతుది. స్థానిక గ్రామాలు, సమీప పట్టణాల ప్రజలకు ప్రత్యేక పాస్‌లు లేదా టోల్ రాయితీ కల్పించాలి. ఇప్పటికైనా అధికారులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు స్పందించి స్థానికుల ఇబ్బందులను పరిష్కరించలి.
వంగ ప్రవీణ్ కుమార్,
హుజూరాబాద్