తెలంగాణ మైనారిటీ గురుకుల విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఓల్లాల శ్రీనివాస్
28-10-2026 | 09:31pm
ముకరంపుర, అక్టోబరు 28 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యుటిఎఫ్)(Telangana State United Teachers' Federation) మైనారిటీ గురుకుల విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఓల్లాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన డాక్టర్ శ్రీనివాస్ ను పలువురు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.