రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్, ఖోఖో పోటీలకు విద్యార్థినుల ఎంపిక
జిల్లా క్రీడారంగానికి గర్వకారణంగా నిలిచిన బాలికలు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): క్రీడారంగంలో ఆసిఫాబాద్ జిల్లా బాలికలు(Asifabad Girls) సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని టీడబ్ల్యూఆర్ఎస్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్(TWRS Model Sports School) బాలికల పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థినులు అండర్-17 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్, ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో హ్యాండ్బాల్కు ఎనిమిది మంది, ఖోఖోకు ఆరుగురు ఎంపిక కావడం విశేషం.
నవంబర్ 13 నుంచి 15 వరకు హ్యాండ్బాల్ పోటీలు(Handball Competitions) మహబూబ్నగర్లో, ఖోఖో పోటీలు మేడ్చల్ జిల్లా శామీర్పేటలో నిర్వహించనున్నారు. హ్యాండ్బాల్ విభాగంలో ఏ. మౌనిక, ఏ. మహేశ్వరి, యు. కవిత, ఎస్. అంజలి, ఏ. సుశీల, సీహెచ్. అక్షిత, ఏ. లక్ష్మి, ఆర్. ఆర్తి ఎంపికయ్యారు. ఖోఖో విభాగంలో ఎన్. సాగరిక, జె. స్వీటీ, డి. శిరీష, డి. అనూష, ఎం. లక్ష్మి, ఏ. గీతాంజలి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
14 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల హెచ్ఎం లింబారావు, ఏటీడీఓ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. డీడీ అంబాజీ, జిల్లా గిరిజన క్రీడల అధికారి షేకు, ఏసీఎంఓ ఉద్ధవ్, జీసీడీఓ శకుంతల, హెచ్డబ్ల్యూఓ విజయలక్ష్మి, కోచ్లు అరవింద్, విద్యాసాగర్, తిరుమల్, రాకేష్ తదితరులు విద్యార్థినులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.