అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం
11-11-2026 | 02:21pm
వేంసూరు. సత్తుపల్లి. నవంబర్ 11. ( విజయ క్రాంతి ): వేంసూరు మండలం చౌడారం తండాలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ(Ayyappa Swamy Padipuja కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొని, అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.