డ్రగ్స్, గంజాయి వినియోగంపై విద్యార్థినులకు అవగాహన

11-11-2026 | 02:19pm
  1. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన 
  2. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై వివరించిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు
  3. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన అధికారులు

సత్తుపల్లి. నవంబర్ 11. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి పట్టణంలోని(Sattupalli town) ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో(Government Junior Girls College ) బుధవారం డ్రగ్స్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. సంపత్ కృష్ణ, సత్తుపల్లి ఎక్సైజ్ సీఐ పాల్గొని విద్యార్థినులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి దుష్పరిణామాల గురించి వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. భాగ్యలక్ష్మి, అధ్యాపకులు ప్రమీల, వనజ, కల్పన, కృష్ణవేణి, రాణి, సమ్మక్క, శిరోమణి, రామారావు, వెంకటేశ్వరరావు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు