పండుగ వేళ పాత్రికేయులకు బీఆర్‌ఎస్‌ సత్కారం

21-10-2026 | 06:39pm

ఎర్రుపాలెం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి పండుగను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో మంగళవారం వివిధ పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు పాత్రికేయులకు శాలువాలు కప్పి, మిఠాయిలు, నూతన వస్త్రాలను బహూకరించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ తమను గౌరవించి, కానుకలు అందజేసి సత్కరించిన బీఆర్‌ఎస్‌ నాయకులకు పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల సీనియర్‌ నాయకులు శ్రీపాలశెట్టి తిరుపతిరావు, బొర్ర నరసింహారావు, గద్దల శ్రీనివాసరావు,మునగలూరి మురళీధర్,యరమల వెంకట నర్సిరెడ్డి, వెంకయ్య, సింహాద్రి వెంకటేశ్వరరావు, షేక్‌ నాగుల్‌ మీరా,వెంకటేశ్వరావు, వెంకట్ పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు