ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి..

04-11-2026 | 07:01pm

జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్

నెలవారీ ఇవిఎం గోడౌన్ తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, నవంబర్ 4 (విజయక్రాంతి): ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్(District Collector Divakara TS) అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ నెలవారీ తనిఖీ చేశారు. ఇవిఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించి, పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు.

అత్యవసర సైరన్ మొగుతున్నది పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రతా లోపాలు లేకుండా చూడాలన్నారు. తనిఖీ రిజిస్టర్లలో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి,  కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం.ఏ. రాజు, డిటి అన్సారీ, అధికారులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు