కందుకూరులో ఉచిత మెగా వైద్య శిబిరం

03-11-2026 | 06:50pm

వేంసూర్ సత్తుపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం పలు వైద్య విభాగాల్లో నిపుణులతో పరీక్షలు, వైద్య సలహాలు వేంసూరు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సింధు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5న వేంసూరు మండలం కందుకూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని(Free Mega Medical Camp) నిర్వహించనున్నారు. హెటిరో గ్రూప్, సింధు హాస్పిటల్స్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి చొరవతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు తక్కువగా అందుబాటులో ఉన్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆంకాలజీ (క్యాన్సర్ కు సంబంధించి న), గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సేవలందించనున్నారు. ముఖ్యంగా మధుమేహ పాద సమస్యలకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన వైద్య సలహాలు, చికిత్సా మార్గదర్శకత్వం అందిస్తారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం, నివారణ చర్యలపై అవగాహన కల్పించడం, సకాలంలో వైద్య సేవలు పొందేలా ప్రజలను చైతన్యపరచడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు. సింధు హాస్పిటల్ కి చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందిస్తారు

మరిన్ని వార్తలు