మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి

03-11-2026 | 07:11pm

సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి 'పొన్నం' ప్రకటన 

కోహెడ, నవంబర్ 3 : ఎల్ నినో ప్రభావంతో సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో(Husnabad Constituency) ఉన్న హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు పరిస్థితుల కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు.

ఈ మూడు మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆయా మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి తన లేఖలో విన్నవించినట్లు చెప్పారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరువు మండలాలుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు