నారాయణ స్కూల్‎లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

16-09-2026 | 10:57am

ఆటపాటలతో అలరించిన చిన్నారులు

సత్తుపల్లి సెప్టెంబర్16.(విజయ క్రాంతి): పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డు లో గల నారాయణ స్కూల్ లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఆటపాటలతో నృత్యాలతో దైవభక్తిని చాటుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు ఉత్సాహంగా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఏజీఎం రామ్ కి విద్యార్థులు, ఉపాధ్యాయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి  మాట్లాడుతూ, మన పండుగలు ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సంతోషం, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. పండుగల ప్రత్యేకతను విద్యార్థులకు వివరించి, వారు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణం భక్తి, ఆనందంతో నిండిపోయింది. విద్యార్థుల ఉత్సాహభరితమైన ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ క్రాంతి,కోఆర్డినేటర్లు ప్రవీణ్, వినోద లక్ష్మి, నీలిమ, ఉపాధ్యాయులు, చిన్నారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు