కల్లూరులో మండల స్థాయి చెకుముకి సంబరాలు

21-11-2026 | 10:40pm

14 పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యం.. విజేతలకు బహుమతులు

కల్లూరు నవంబర్ 21 (విజయక్రాంతి): జన విజ్ఞాన వేదిక(People's Science Forum) ఆధ్వర్యంలో స్థానిక పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(PM Sri Government High School) మండల స్థాయి చెకుముకి సంబరాలు నిర్వహించారు. ఎంఈఓ ఐ. పవన్ కుమార్ ప్రశ్నాపత్రం, గోడపత్రికలను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. మండలంలోని 14 పాఠశాలల విద్యార్థులు(Students) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విజ్ఞాన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు కె. మనోహ్య, ఎస్.కె. సీమ, బి. నవ్య శ్రీ దుర్గ ప్రథమ, పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు సి.హెచ్. తిరుమల రావు, పి. దిలీప్, శ్యామల ద్వితీయ, జెడ్పీహెచ్ఎస్ చండ్రుపట్ల విద్యార్థులు ఎ. స్వాతి, బి. తేజస్విని, టి. ఉషశ్రీ తృతీయ బహుమతులు సాధించారు.

ప్రైవేట్ పాఠశాలల విభాగంలో విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు ఎం. శశాంక్, టి. సీదిఖ్ ప్రథమ, బాలాజీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆర్. సత్య, టి. తీర్థకర్, బి. లహరి ద్వితీయ, సెంచరీ టెక్నో స్కూల్ విద్యార్థులు కె. భవ్యశ్రీ, వి. పవిత్ర, వి. దినేష్ చంద్ర తృతీయ స్థానాల్లో నిలిచారు.కీ.శే. కొడిశాన బాబురావు ట్రస్ట్ పేరిట ఆయన కుమారులు విజయ్ కుమార్, డాక్టర్ వినోద్ బహుమతులు అందజేశారు.

కార్యక్రమానికి పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు జొన్నలగడ్డ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కమిటీ అధ్యక్షుడు అలెగ్జాండర్, ప్రధాన కార్యదర్శి మొగిలి రఘు, సైన్స్ ఉపాధ్యాయులు జి. సుధీర్, ఎం. సత్యం, నేతాజీ, కె. కృపేంద్రయ్య, బి. శ్రీనివాసరావు, ఎస్.వి. నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు