బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడికి సైతం సంక్షేమ పథకం

18-11-2026 | 07:42pm

పార్టీలకతీతంగా ప్రజాసేవే లక్ష్యం

కల్లూరు, నవంబర్ 18 (విజయ క్రాంతి): కుల, మత, రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందించడమే తమ లక్ష్యమని రఘునాథగూడెం సర్పంచ్(Sarpanch of Ghunathagudem) తెలిపారు. ఇందుకు నిదర్శనంగా గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడికి సైతం ప్రభుత్వ పథకం అందించామన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా సహకరించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు