శరత్ ఆర్తో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్ ప్రారంభం
డాక్టర్ మందడపు శరత్ చంద్ర ను అభినందించిన కర్నాటి రామారావు.
మధిర,నవంబర్5(విజయ క్రాంతి): ఖమ్మం నగరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డాక్టర్ మందడపు శరత్ చంద్ర(Dr. Mandadapu Sarath Chandra) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శరత్ ఆర్తో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్(Ortho and Spine Care Hospital) ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం పట్టణంలోని మాజీ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణాపురం గ్రామ మాజీ సర్పంచ్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, కర్నాటి వెంకటేశ్వరరావు, చావా యాదగిరి రావు, సాదినేని వంశీ పాల్గొని డాక్టర్ మందడపు శరత్ చంద్రకు వారు శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం నగర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆర్థోపెడిక్ మరియు వెన్నెముక సంబంధిత సమస్యలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందిస్తూ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో మరిన్ని ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.