తల్లీబిడ్డల సంరక్షణకు యెన్నం భరోసా.. హెల్త్ కిట్స్ అందజేత

05-11-2026 | 03:09pm

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన వస్తువులతో కూడిన ‘యెన్నం హెల్త్ కిట్స్‌’ను పంపిణీ చేశారు.

గత ఏడాది నవంబర్ 14న సొంత నిధులతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, కాంగ్రెస్ నాయకుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు