జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

05-11-2026 | 03:09pm
  1. బోధన్‌లో పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడి 50వ వర్ధంతి సందర్భంగా అమరత్వ స్ఫూర్తి ర్యాలీ
  2. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు.. ఘనంగా నివాళులు

బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు(Founder of PDSU), విద్యార్థి ఉద్యమ నేత కామ్రేడ్ జంపాల(Movement leader Comrade Jampala ) చంద్రశేఖర ప్రసాద్ 50వ వర్ధంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విద్యార్థులు అమరత్వ స్ఫూర్తి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థి ఉద్యమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని నినాదాలు చేశారు. జంపాల చంద్రశేఖర ప్రసాద్ చేసిన త్యాగాలు, విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన స్ఫూర్తిని కొనియాడారు.

పీడీఎస్‌యూ నాయకులు గౌతమ్, సాయి మాట్లాడుతూ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, విద్యార్థుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని ప్రతినబూనారు. ఆయన చూపిన ఉద్యమ బాటలో పయనిస్తూ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ త్యాగాలు విద్యార్థి లోకానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు