ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రధమ లక్ష్యం

13-11-2026 | 07:26pm

లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు,ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయ‌క్‌

కారేపల్లి, నవంబర్ 13 విజయ క్రాంతి : కారేప‌ల్లి మండల కేంద్రంలో శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్(Wyra MLA Maloth Ramdas Naik) ఇచ్చిన ప్రతి వాగ్దానాలను నెరవేర్చడమే లక్ష్యంగా  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత కారేపల్లి జిన్నింగ్ మిల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేసే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ఐటీడీఏ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు,నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులను అందజేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  డీఎల్పీఓ రాంబాబు, తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో బానోత్ పద్మ, ఐసీడీఎస్ సీడీపీఓ కే.ఉమా, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, విద్యుత్ ఏ ఈ , వెంకన్న ,శ్రీశైలం,

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు,సర్పంచ్ లు మేదరి వీరప్రతాప్, బానోత్ హిరాలాల్, హేమలత బాలాజీ, ఉండం రాఘవులు, వరలక్ష్మీ రాజు, దండు ప్రవీణ్, కిషోర్, రాందాస్,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల మంజుల, బానోతు రామ్మూర్తి, విష్ణువర్ధన్ రెడ్డి, బానోతు దేవలా నాయక్, అడ్డగోడ ఐలయ్య, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు