సామగ్రిని ప్రారంభించిన సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి
ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండలం పరిధిలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాల(Venkatapuram Primary School)లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గది(Pre-Primary Classroom) ఫర్నిచర్, ఆట వస్తువులు మరియు బోధనా సామగ్రిని శనివారం గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులకు ఉచిత యూనిఫాం, షూస్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ పేద విద్యార్థుల(Students)కు బాల్యం నుంచే ఆటపాటలతో కూడిన కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ గొప్ప సంకల్పమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెల్లంకి నాగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ బడులలో ప్రీ-ప్రైమరీ తరగతుల ఏర్పాటు చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రవి సంతోషం, గ్రామ పెద్దలు కర్నాటి సుధాకర్ రెడ్డి, యరమల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు ఆర్. రామారావు, ఆయా కవిత, స్కావెంజర్ లక్ష్మి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.