ఘనంగా 73వ సహకార వారోత్సవాలు
పతాకావిష్కరణ చేసిన సంఘం అధ్యక్షుడు అలీ బిన్ అహ్మద్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్(Agricultural Cooperative Society) ఆధ్వర్యంలో 73వ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఘనంగా పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు అలీ బిన్ అహ్మద్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సహకార రంగం అభివృద్ధిలో రైతులు, సహకార సంఘాల పాత్రను గుర్తు చేసుకున్నారు. రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో సహకార సంఘాల ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ హైమద్, అడ్వకేట్స్ సంఘం అధ్యక్షుడు రాపర్తి రవి, సహకార సంఘం వైస్ చైర్మన్ రూకం ప్రహ్లాద్, సంఘం డైరెక్టర్లు విజయలక్ష్మి, దుర్గం దావు, జావిద్, బ్యాంకు మేనేజర్ వెంకట రవీందర్, కోట తిరుపతి, సంఘం కార్యదర్శి వెంకటరమణ, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.