అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
14-11-2026 | 03:03pm
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): పట్టణంలోని జనకాపూర్ 1వ వార్డులో అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్, వార్డు అధికారి కలిసి పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు.