ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

12-11-2026 | 02:55pm

డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల(NHM employees) సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హామీ ఇచ్చారు. గురువారం ఎన్‌హెచ్‌ఎం-జేఏసీ రాష్ట్ర(NHM-JAC State) ప్రతినిధులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సుమారు 11 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు