క్రీడా పోటీల్లో సత్తా చాటిన ఎంజేపీ బాలికలు

14-11-2026 | 02:54pm

పలు విభాగాల్లో పతకాల పంట.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో(Sports Competitions) ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల(Jyotiba Phule Gurukul School) బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో రాణించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించడంతో పాటు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

కబడ్డీ విభాగంలో వైష్ణవి బృందం ప్రథమ స్థానం సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి, 1500 మీటర్ల పరుగులో బిక్కుబాయి ప్రథమ స్థానాలు పొందారు. డిస్కస్ త్రోలో జె. సుజాత ప్రథమ స్థానం సాధించగా, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. టెన్నికాయిట్‌లో సుజాత, అశ్విత శ్రీ ద్వితీయ స్థానం సాధించారు.

లాంగ్ జంప్, 400 మీటర్ల పరుగు పందెంలో జి. అక్షయ ద్వితీయ స్థానాలు పొందగా, డిస్కస్ త్రోలో ఎ. హిమబిందు ద్వితీయ, షాట్‌పుట్‌లో తృతీయ స్థానం సాధించారు. 800 మీటర్ల పరుగులో ఎం. హర్షిక తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుని పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

విద్యార్థినులు సాధించిన విజయాలపై ఆర్‌సీఓ శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు