దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం

06-11-2026 | 05:13pm

ఆసిఫాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): దీపావళి పండుగను(Festival of Diwali) ప్రజలు అప్రమత్తంగా, ప్రమాదాలు(Accidents) జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని ఈఎంఆర్‌ఐ జీహెచ్‌ఎస్(EMRI GHS) 108 జిల్లా మేనేజర్ సుధాకర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో 108 అంబులెన్స్ సేవలు(Ambulance Services) 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు, కంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108కు కాల్ చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు