ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

21-11-2026 | 03:21pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని(Telangana Mudiraj Mahasabha Formation Day) పురస్కరించుకొని శుక్రవారం జనకాపూర్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi)ని కలిసి ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి సతీష్, ప్రధాన కార్యదర్శి నెల్లి రవి, నరేష్, సాయి, సతీష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు