పల్లెకు రాని బస్సు
- వారం రోజులకే నిలిచిన ఆర్టీసీ సర్వీసు
- గిరిజన గ్రామాల ప్రజలకు ఇక్కట్లు
బెజ్జూర్, నవంబర్ 1౬ (విజయక్రాంతి): గిరిజన గ్రామాలకు(Tribal villages) ఆర్టీసీ బస్సు సేవలు(RTC bus services) నిలిచిపోతున్నాయి. పల్లె వెలుగు బస్సు పల్లెకు రాకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బెజ్జూర్(Bejjur) నుంచి సోమిని, మొగవెల్లి, గూడెం మీదుగా మహారాష్ట్రలోని అహిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసు(RTC bus service) ప్రారంభమైన వారం రోజులకే నిలిచిపోయింది. రహదారిపై గుంతలు ఏర్పడి కంకర తేలడంతో బస్సులు నడపడం ప్రమాదకరంగా మారిందని డ్రైవర్లు పేర్కొంటున్నట్లు ప్రయాణికులు తెలిపారు.ఈ బ స్సు సౌకర్యంతో సోమిని, కృష్ణపల్లి, ఇందిరిగాం, ఎలుకపల్లి, నాగుల్వాయి తదితర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభమయ్యాయి.
ముఖ్యంగా చిరువ్యాపారులు కూరగాయల విక్రయాల కోసం అహిరికి వెళ్లేవారు. ప్రస్తుతం బస్సు సేవలు నిలిచిపోవడ ంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ అ ధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తలాయికి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు సైతం రహదారి అధ్వానంగా ఉండటంతో పాపన్నపేట గ్రామం వరకే పరిమితమవుతోంది. దీంతో మారుమూల గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ముగిసినా రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలి
గిరిజన గ్రామాలకు రోడ్డు సరిగా లేక బస్సులు రావడం లేదని సోమినికి చెందిన అమృత ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని రహదారులకు మరమ్మతులు చేయించి గ్రామాలకు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స ్పందించి రోడ్లను బాగు చేయించాలని, పల్లె వెలుగు బస్సులను మారుమూల గ్రామాలకు నడపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమృత, సోమిని