చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

04-11-2026 | 05:04pm

ఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. గుడుంబా, పేకాట, బెట్టింగ్, గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని తెలిపారు. ఈ తనిఖీలో కౌటాల సీఐ సంతోష్, ఎస్సై కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు