వలసలు నివారించేందుకు కూలీలకు పని కల్పించాలి

06-11-2026 | 03:18pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉపాధి కోసం కూలీలు వలసలు వెళ్లకుండా స్థానికంగానే వి.బి.జి. రామ్ జీ పథకం ద్వారా 125 రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(Chief Secretary Sanjeev Jaju) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో మౌలిక వసతులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంపై సమీక్షించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె హరిత , అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి ,ఆర్డిఓ లోకేశ్వరరావు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు