మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు

16-10-2026 | 11:54am

మహాలక్ష్మి అవతారంలో వాసవి అమ్మవారి దర్శనం

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శివ పంచాయతన క్షేత్రంలో వాసవి అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ.6,11,116 విలువైన ఆభరణాలతో అమ్మవారిని అలంకరించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

మహాలక్ష్మి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. పలువురు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. హిందూ సంప్రదాయంలో మహాలక్ష్మి దేవిని సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యాలకు ప్రతీకగా పూజిస్తారని ఆలయ ప్రచార కార్యదర్శి బి. రాజేంద్రప్రసాద్ తెలిపారు. మహాలక్ష్మి రూపంలో అమ్మవారి దర్శనం భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు