బెల్ట్ షాపులు బంద్ చేయాలని గ్రామస్థుల డిమాండ్

09-11-2026 | 01:56pm

ఆసిఫాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ గ్రామం(Buruguda Village)లో బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో యువత మద్యానికి బానిసవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి అక్రమ బెల్ట్ షాపులను మూసివేయాలని కోరారు.

మరిన్ని వార్తలు