మాస్ ‘ఈగో రాజా’

22-11-2026 | 05:10am

టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్(Tollywood hero Aadi Saikumar), కోలీవుడ్ నటుడు సతీశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగో రాజా’. ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ సురేశ్ నిర్మించిన ఈ సినిమాలో శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను హీరో రవితేజ విడుదల చేశారు. లోన్ యాప్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఆది మాస్ లుక్‌లో ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: మనోజ్ పరమహంస; సంగీతం: గిబ్రాన్. 

మరిన్ని వార్తలు