గోగులు గోగులు..

22-11-2026 | 05:10am

ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’(Idupu Kayitham). బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

డిసెంబర్ 11న రిలీజ్ కానున్న ఈ చిత్రం నుంచి శనివారం ‘గోగులు గోగులు..’ సాంగ్ విడుదలైంది. ‘గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి, గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి, గోగులు గోగులు గోపాలకృష్ణుడు ఆనంద బాలుడు నందకుమారుడు, రమ్మనరే రమ్మనరే నలుగుకు నా ముద్దు గోపాలకృష్ణున్ని, రమ్మనరే నలుగుకు నా ముద్దు గోపాల కృష్ణుని...’ అంటూ సాగుతోందీ గీతం. సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి స్వరపర్చిన ఈ పాటను కొంగరి కృష్ణ రాయగా.. అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ పాడారు. 


మరిన్ని వార్తలు