మరి కాంగ్రెస్ హామీల మాటేమిటి?

22-11-2026 | 05:10am

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister of India Indira Gandhi) జయంతి రోజు నవంబర్ 19న, సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ పెట్టిం ది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సహజ ధోరణిలోనే ప్రభుత్వాధినేతగా కాకుండా ఒక పార్టీ నాయకుడిగా దాదాపు గంట సేపు ప్రసంగించారు. అందులో దరిదాపు 35 నిమిషాలకు పైగా మాజీ ముఖ్యమం త్రి కేసీఆర్, మాజీ మంత్రులు.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, తారక రామారావులపై తీవ్ర పదజాలంతో పదునైన విమ ర్శలే చేశారు.

వర్షాకాల శాసనసభ సమా వేశాలలో ఛాలెంజ్ చేసిన విధంగానే సిరిసిల్ల, సిద్దిపేటలో బహిరంగ సభలు నిర్వ హించి పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపైన, అప్ప టి ప్రభుత్వంలో కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపైనా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లోనే కాదు, సిద్దిపేటలో 1985 నుంచి, సిరిసిల్లలో 2004 నుంచి కాంగ్రెస్ ఆనవాళ్లు కూడా దొరక టం లేదు. ఈ రెండు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా మార్చడమే కాదు, వా టికి ప్రాతినిథ్యం వహించిన..

వహిస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్ అక్కడ పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అం చేత, ఆ ఇద్దరు లక్ష్యంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయా సభల్లో విమర్శలు గుప్పించారు. వారిద్దరు అధికారం మాటు న అక్రమంగా సంపాదించారని ఆరోపణలు చేశారు.

అంతేకాదు, సిద్దిపేట.. సిరిసి ల్లలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారికి మం త్రి పదవులు కూడా ఇస్తానని సభా వేదిక నుంచి సీఎం రేవంత్ ప్రకటించేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో, ఆ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ మూడేండ్లలో వేదికేదైనా, సందర్భం ఏదైనా బీఆర్ ఎస్ పాలనను తూర్పారబట్టడంలో.. ఆ ముగ్గురిని వ్యక్తిగత స్థాయి నుండి అధికారిక స్థాయి వరకు విమర్శిస్తూనే, నాడు వారిపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని నేటికీ సజీవంగా ఉంచే వైఖరినే ముఖ్యమంత్రి రేవంత్ అనుసరిస్తున్నారు.

ప్రశ్నలే ప్రశ్నగా..

రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై లేవనెత్తుతున్న ప్రశ్నలు తిరిగి తననే ప్రశ్నిస్తున్న ట్లుగా కనపడుతున్నది. రేవంత్‌రెడ్డి, కేటీఆర్ మధ్య పరస్పర విమర్శలు విధానపర మైనవి కాకుండా వ్యక్తిగత, కుటుంబపరమైన అంశాల ప్రస్తావనే కాదు.. అవినీతి, ఆస్తుల విషయంలో వారి జాతకాలను వారే బయటపెట్టుకుంటున్న తీరు చూసి తెలంగాణ ఏర్పాటు వీరి కోసమేనా? ఇం దుకోసమేనా?అని ప్రజల్లో సందేహాలొస్తు న్నాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుం బ అవినీతిని రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తుంటే, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కుటుంబంపై,

సహచర మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలను బీఆర్‌ఎస్సూ ప్రశ్నిస్తున్నది. అభివృద్ధి అంటే గజ్వేల్, సిరిసిల్ల సిద్దిపేట మాత్రమేనా అని నాడు రేవంత్‌రెడ్డి ప్రశ్ని స్తే..  నేడు కొడంగల్, మధిర, హుజూర్‌నగరేనా అని అధికార పార్టీ నేత రాజగోపా ల్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ‘తూ.. మీ బతుకులు చెడ ఆడబిడ్డలకిచ్చే చీరల్లో  డా కమీషన్ తీసుకుంటారా?’ అని సీఎంను విమర్శిస్తున్నారు. నాడు బతుకమ్మ చీరల నాణ్యతపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్లలో ఒక్కసారి మాత్ర మే చీరలు పంచారు.

మరోపక్క మాకు ప్రతి నెల రూ.2500 ఇస్తామనే హామీ ఎందుకు అమలు చేయడం లేదని మహిళలు నిలదీస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించి అమరుల కు టుంబాలకు అవకాశం కల్పించే విషయంలో కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తు న్నారు.. కానీ, 2014లో శంకరమ్మను హుజూర్‌నగర్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పోటీకి దించితే, రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నేటి పార్టీ, నాటి పార్టీలు అమరుడి తల్లిని ఓడించిన తీరు ను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

శంకరమ్మకు ఏ అవకాశం ఇచ్చినా ఆమె కడుపు కోత తీర్చలేనిది. శ్రీకాంతాచారి త్యాగం వెలకట్టలేనిది. కానీ అమరుల త్యాగాలను, వారి కుటుంబాలను పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం బాధాకరం. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, నీటి వాటాల పంపకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రేవంత్‌రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం,  పల్నాడు వాటర్ గ్రిడ్ అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే ఏమి చేశారు?

కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను రిపేర్ చేసుంటే కరువుని సమర్థంగా ఎదుర్కొనే వారిమే కదా! అనే ప్రశ్నలకు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది నిజం కాదా! పాలమూరును మోసం చేసి గజ్వేల్‌కు వెళ్లావని విమర్శిస్తే కొడంగల్‌ను వది లి మల్కాజిగిరికి వెళ్లలేదా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. వారైనా, వీరైనా ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నారు. కానీ, సమాధానాలు చెప్పకపోవడం.. అందరూ ఆ థాను ముక్కలేననే భావన వ్యక్తమవుతున్నది. 

హామీల సంగతేంటీ? 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ తప్పిదాలపైన మూడేండ్లుగా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ 2023 ఎన్ని కల సందర్భంగా ఇచ్చిన గ్యారెంటీలు, డిక్లరేషన్లు, హామీల అమలు తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడిన 6 గ్యారెంటీలలో కీలకమైన పెన్షన్లు, మహిళలకు 2500 ఆర్థిక సహాయం అమలు కాకపోవడం, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ రూ.4000, బెంగాల్‌లో మహిళలకు రూ.3,000 ఇస్తున్న తీరును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.

అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేయకపోవడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపో వడంతో నిరుద్యోగులు మోసపోయామని భావిస్తున్నారు. తులం బంగారం, స్కూటీల హామీ అటకెక్కటం, రైతు రుణమాఫీ చేసి నా రైతు భరోసా అందించకపోవడం రైతు ల్లో అసంతృప్తి రాజేస్తున్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువ వికాసం పథకాల ఊసెత్తకపోవడం, దళిత బంధు, బడ్జెట్‌లో బలహీన వర్గాలకు నిధులు కేటాయించకపోవడం, కులగణన చేసినా రిజ ర్వేషన్లు దక్కకపోవడంతో ఆయా సామాజికవర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నా యి.

గడిచిన మూడేండ్ల పాలనా కాలంలో రేవంత్‌రెడ్డి ఒక బలమైన రాజకీయ నేతగా కనిపించినంతగా సమర్థవంతమైన పాలకుడుగా కనిపించడం లేదనే చర్చ జరుగుతు న్నది. తన ప్రభుత్వ విధానాలపైన, వైఫల్యాలపైన, హామీల అమలుపైన చర్చ జరగ కుండా జాగ్రత్త పడటంలో, విపక్ష నేతలపై అవినీతి ఆరోపణలు, వారి ఎత్తు, గడ్డంపైన కామెంట్ చేస్తూ ఆ అంశాలపైనే ప్రజల్లో చర్చ జరిగే విధంగా వ్యూహాలు రూపొందించడంలో రేవంత్ రెడ్డి విజయం సాధిం చారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతున్నది.

పార్టీలో అసంతృప్తి స్వరాలు

2034 వరకు నేనే అధికారంలో ఉం టానని ముఖ్యమంత్రి ప్రతి సభలో బలం గా చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లవుతున్న సమయంలో పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి టార్గెట్‌గానే పార్టీలోని నాయకులు విమర్శలు చేస్తున్నారు. మా పార్టీలోనే ఎర్రి కుక్క కరిచిన కొంతమంది నాయకులు మంచిని చెవుల్లో, చెడును మైకుల్లో చెపుతున్నారని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో, రైతుల ప్రయోజనాలను కాపాడటంలో, ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితుల తరువాత జరిగిన ఎన్నికలలో ప్రభుత్వాలు గెలిచిన దాఖలాలు లేవని నాయకులు మాట్లాడుకుంటున్నారు. మరి కొందరు నాయకులు తాము రాబోయే ఎన్నికలలో పోటీ చేయమని చెప్పటం చూస్తుంటే అప్పుడే గెలు పుపై ఆశలు వదిలేసుకున్నారా! అనే అనుమానాలు కలగక మానవు.

ఒక పార్టీ గెల వడానికి గత ప్రభుత్వంపై అసంతృప్తి సరిపోతుంది, కానీ ఒక ప్రభుత్వం మళ్ళీ ఎన్ని కలలో గెలవడానికి ఆ ప్రభుత్వ పనితీరు గీటురాయిగా ఉంటుంది. ప్రజాపాలన కూడా ఫామ్‌హౌస్ పాలనలాగే ఉందని ప్రజలు భావిస్తే ముఖ్యమంత్రి చెబుతున్న ట్లు 2029లో మరొకసారి గెలుపు సాధ్యమవుతుందా! ప్రజలు అమాయకులు ఏదో ఒక పథకం ప్రకటించి ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టి గెలవాలనుకుంటే అమెరికా మధ్యంతర ఎన్నికలలో ట్రంప్‌కు ఎదురైన ఓటమి ప్రజలను మభ్య పెట్టే పాలకులకు కూడా ఎదురవుతుంది.

 : అసిస్టెంట్ ప్రొఫెసర్ సెల్ : 9885465877

మరిన్ని వార్తలు