పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం

13-11-2026 | 10:32pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): పశ్చిమాసియాలో(West Asia) కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా  క్రూడాయిల్(Crude oil), వంటగ్యాస్ రవాణా, వాటి ఉత్పత్తులు, సరఫరాలకుకొరత, ఆటంకాలు తలెత్తకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ(BRS Parliamentary Party) లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్ హాలులో శుక్రవారం  సమావేశమైంది.

సంఘం ఛైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి  ఎంపీ రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దేశంలో పెట్రోలియం,డీజీల్, వంటగ్యాస్ సరఫరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిచ్చారు.

వంటగ్యాస్ కొరత చోటుచేసుకోకుండా వినియోగదారులకు సత్వరమే సేవలందించాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కోరారు. వృధాలు, వ్యర్థాలను పూర్తిగా అరికట్టాల్సిందిగా, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా పకడ్బంధీగా ప్రణాళికలు అవసరమని అధికారులకు ఎంపీ రవిచంద్ర పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు