కామ్రేడ్ గోద యాదగిరి ఆశయాల సాధనకై కలిసి పోరాడుదాం

13-11-2026 | 10:28pm

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు

యాదగిరిగుట్ట, నవంబర్ 13 (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట(Yadagirigutta), పరిసర ప్రాంతాలలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో మంది పేద ప్రజలకు భూములను, ఇండ్ల స్థలాలను(House sites) ఇప్పించిన ఘనత కామ్రేడ్ గోద యాదగిరిదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు(Goda Sriramulu) అన్నారు. శుక్రవారం 

అమరజీవి కామ్రేడ్ గోదా యాదగిరి 27 వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ పార్టీ కార్యాలయం(CPI Party Office) వద్ద నిర్వహించడం జరిగింది.అరుణ పతాకాన్ని సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ బబ్బూరి నాగయ్య ఎగరవేయడం జరిగింది. సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ పేరబోయిన పెంటయ్య చిత్ర పటానికి పూలమాల వేసి వేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథి హాజరై అయిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు మాట్లాడుతూ  గోద యాదగిరి తన జీవిత కాలం పేద ప్రజల కోసం పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన గొప్ప ఆదర్శ నాయకుడు అన్నారు.

ఇండ్లు లేని వారి కోసం ఇండ్ల స్థలాల పోరాటం చేసి 220 గజాల స్థలం 350 మందికి ప్లాట్లు పంపిణీ చేశారు. అలాగే పాత గుట్ట రోడ్డుకు 13 గుంటల చొప్పున భూమి నీ పంపిణీ చేశారు. మహిళా సమస్యలు, గ్రామాలలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారము కొరకు మండలం , ఇతర ప్రాంతాల నుండి గోదా యాదగిరి వద్ద కు ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే వారు అన్నారు. యాదగిరి గుట్ట పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు బస్ స్టాండ్ ,డిపో వారి పోరాటం వలనే ఏర్పడింది అన్నారు.

నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయం నిర్మాణం కు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళెం కృష్ణ, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, పేరబోయిన మహేందర్ , కొల్లూరి రాజయ్య,సిపిఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్,సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్,మండల కార్యవర్గ సభ్యులు ఆరే పుష్ప, సంజీవ, మీసాల దాసు, పేరపు రాములు, మరిగూడం సర్పంచ్ స్వప్న జగన్, చిన్న కందుకూర్ ఉప సర్పంచ్ కాటము శ్రీకాంత్,కోకిల రవీందర్,తుమ్మల ఇస్తారీ, చందునాయక్, సత్తిబాబు,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు