రామప్ప కాలనీ సమీపంలో ఇండ్ల స్థలాల పనులు ప్రారంభం

13-11-2026 | 10:25pm

గణపురం, నవంబర్ 13 (విజయక్రాంతి): గణపురం మండలంలోని(Ganapuram Mandal) రామప్ప కాలనీ సమీపంలో నగరంపల్లి గ్రామానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు(Beneficiaries) కేటాయించిన ఇండ్ల స్థలాల్లో(House plots) భూమి చదును పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సింగరేణి సంస్థ(Singareni Company) ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టారు. 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ, అప్పటి నుంచి స్థలాలను చదును చేసి ఫ్లాట్లు కేటాయించే పనులు ప్రారంభం కాలేదు.

దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎట్టకేలకు భూమి చదును పనులు ప్రారంభం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ చింతకుంట్ల శ్రీనివాస్‌తో పాటు గ్రామస్థులు ఆకుల కట్టయ్య, మేకల సాంబయ్య, పూజారి సాంబయ్య, పెద్ది ప్రశాంత్, మెంద్రపు మల్లేష్, మహబూబ్ పాషా, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు