చెంచుల ఆరోగ్య భద్రతే మా లక్ష్యం

13-11-2026 | 10:29pm

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

నవంబర్ 13 (విజయక్రాంతి) అచ్చంపేట: చెంచు గిరిజన గూడాల్లో నివసించే చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(MLA Dr. Rikudu Vamsi Krishna) అన్నారు. శుక్రవారం అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో చెంచుల కోసం ప్రత్యేక వార్డులు, గర్భిణుల కోసం బర్త్ వెయిటింగ్ వార్డులు, చిన్నారులకు ప్రత్యేక వార్డులను అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా తో కలిసి ప్రారంభించారు. చెంచులకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యాధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు