ఇటు కేసులు.. అటు రికవరీ

02-11-2026 | 05:30am
  1. సీఎంఆర్ బియ్యం సేకరణ వేగవంతం 
  2. బకాయి పడ్డ రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు 

మహబూబాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): సీఎంఆర్ సేకరణలో(CMR Procurement) ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. పదేళ్లుగా సీఎంఆర్ డిఫాల్ట్, టెండర్ ప్యాడి బకాయి ప డ్డ రైస్ మిల్లర్ల నుంచి ముక్కు పిండి బియ్యం లేదంటే అందుకు తగ్గ విలువ, జరిమానాతో కూడిన డబ్బుల వసూళ్లకు శ్రీకా రం చుట్టింది.

ఇందుకోసం ప్రత్యేకంగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో బకాయి పడ్డ రైస్ మిల్లుల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇంకోవైపు సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెట్టిన మిల్లర్ల వ్యవహారంపై సీరియస్‌గా పరిగణించి ప్రత్యేకం గా సీబీ సీఐడీని రంగంలోకి దింపింది. రాష్ట్రంలో ఏదో ఒకచోట అక్రమాలకు పా ల్పడ్డ రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయడం, కొన్నిచోట్ల మిల్లర్లను అరెస్టు చేయడం జరుగుతోంది. 

2025 వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కింద కేటాయించింది. ఈ బియ్యాన్ని సేకరించడానికి ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు ఐఏఎస్ స్థాయి అధికారులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి నియమించింది. అధికారుల పర్యవేక్షణలో నిత్యం మిల్లుల నుంచి బియ్యం రికవరీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా తాజాగా, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.

వానకాలం, యాసంగి సీజన్‌లో మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని ఇప్పుడు వెంట వెంటనే బియ్యం పట్టించి గోదాములకు పంపించే విధంగా శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో జిల్లా నుంచి కనీసం 40 (ఏసీ కే) లారీల బియ్యాన్ని గోదాములకు మిల్లర్లు రవాణా చేసే విధంగా కార్యాచరణ చేపట్టా రు.

ఈ ఏడాది ధాన్యం తీసుకున్న మిల్లర్లతో శనివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిం చి, బియ్యం సేకరణలో ఎలాంటి జా ప్యం ఉండదని, మిల్లర్లు వెంట వెంటనే బియ్యం పట్టించి టార్గెట్ పూర్తి చేసే విధంగా సహకరించాలంటూ ప్రత్యేక అధికారులు సూచిం చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పం పిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ఈ నెల కోటా బియ్యం డీలర్లకు పంపిణీ చే యడంతో, గోదాములు ఖాళీ అయ్యే అవకాశం ఉండడంతో, వెంటనే బియ్యం సేకర ణ కార్యక్రమాన్ని ముమ్మరం చేసే విధంగా ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు భావిస్తున్నారు. ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల్లో వరి పంట ఈసారి ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలకు పెద్దగా వచ్చే అవకాశాలు లేవంటున్నారు.

ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించడానికి బియ్యం రేట్లను కిలోకు 64 నుంచి 79 రూపాయల గరిష్ట ధర  ఖరారు చేయడంతో మిల్లర్లు కూడా నే రుగా రైతుల నుం డి క్వింటాలకు 2,800 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసే అవకాశాలున్నాయ ని చెబుతు న్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ముం దుగానే మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న సీ ఎంఆర్ ధాన్యాన్ని మిల్లు పట్టించి బియ్యం సేకరించాలని లక్ష్యంతో ఉందని చెబుతున్నారు.

629 టన్నుల ధాన్యం గల్లంతు

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలో పెద్దనాగారం గ్రా మంలో శ్రీ శ్రీ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ సప్లై అండ్ కార్పొరేషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన సీఎంఆర్ 629.429 టన్నుల ధాన్యం లేదని గుర్తించి, ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన సదరు రైస్ మిల్లు యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తల్లాడ చంద్రమోహన్, భువనగిరి సురేష్, ఉప్పుల వెంకటేశ్వర్లు, ఉప్పుల కృష్ణమూర్తి, ఉప్పుల నాగేశ్వరరావు, గుడిపాటి శిరీషపై కేసులు నమోదు చేశారు.

(బండి సంపత్ కుమార్) 



మరిన్ని వార్తలు