సర్కార్ బడిలో అల్పాహారం..!
- నెల రోజుల్లో 20వేల మందికి బ్రేక్ ఫాస్ట్..
- మెదక్ జిల్లాలో అమలవుతున్న పథకం..
- మరో 11మండలాల్లో అమలుకు సిద్ధం..
- ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ
- పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరుకు బ్రేక్..
మెదక్, నవంబర్ 1 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో(School Breakfast Program) భాగంగా మెదక్ మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెప్టెంబర్ 26న ప్రారంభమైంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తున్న.
ఈ కిచెన్ విజయవంతంగా నెల రో జుల సేవలను పూర్తి చేసుకుంది. మెదక్ జి ల్లాలోని మెదక్, హవేలీ ఘన్పూర్, వెల్దుర్తి, రామాయంపేట, పాపన్నపేట ఐదు మండలాల్లోని 238 ప్రభుత్వ పాఠశాలలు, 5 ప్ర భుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న మొత్తం 20,451 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తున్నారు.
మరో 11మండలాల్లో విస్తరించనున్న బ్రేక్ ఫాస్ట్..
త్వరలోనే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని మరో 11 మండలాల్లోని 395 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విస్తరించనున్నారు. తద్వారా మొత్తం 29,183 మంది విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం సీఎం చేతుల మీదుగా కొడంగల్లో పైల ట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అనంతరం మధిర, మంథని, మంచి ర్యాల, కరీంనగర్, మెదక్ తదితర ప్రాంతాల కు విస్తరించింది. విద్యార్థులకు సమతుల్యమై న పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇ న్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో అల్పాహార మెనూను రూపొందించా రు. అంతేకాకుండా వివిధ రకాల అల్పాహారంతో పాటు విద్యార్థులకు రోజు విడిచి రో జు వేడి పాలను కూడా అందిస్తున్నారు.
వి ద్యార్థులు ఉదయం ఆకలితో పాఠశాలలకు రాకుండా, పోషకాహారంతో కూడిన అల్పాహారం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠ శాల హాజరు మెరుగుపరచడమే ఈ కార్యక్ర మం ప్రధాన లక్ష్యం అని హరే కృష్ణ మూవ్మె ంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ని ర్వాహకులు తెలిపారు.
హాజరు శాతం మెరుగుపడింది..
ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడంతో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తుంది. హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అత్యంత నాణ్యతతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు హాజరు శాతం మెరుగుపడింది. అంతేకాదు ఉత్సాహవంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసిస్తున్నారు.
ప్రతిమా సింగ్, మెదక్ కలెక్టర్
అల్పాహార మెనూ..
సోమవారం - ఇడ్లీ సాంబార్
మంగళవారం - పూరి ఆలూ కుర్మా
బుధవారం - దోశ చట్నీ
గురువారం - ఉప్మా చట్నీ
శుక్రవారం - మిల్లెట్ ఇడ్లీ సాంబార్
శనివారం - బోండా చట్నీ