జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి వివేక్ ఆర్థిక సాయం!
27-11-2026 | 10:35pm
మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్(Mahabubabad) పట్టణంలో ఇటీవల మరణించిన జర్నలిస్టు యాకూబ్(Journalist Yakub) కుటుంబాన్ని డీ ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్(DSFI National President Dr. Vivek) పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు ఎంతో విలువైనవని, యాకూబ్ మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని డాక్టర్ వివేక్ పేర్కొన్నారు. వారి కుటుంబానికి డీఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.