ఇందిరమ్మ బీమా పేద కుటుంబాలకు ధీమా
కేసముద్రం: ఇందిరమ్మ బీమా పథకం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ధీమా కలిగిస్తుందని కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality) చైర్ పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ అన్నారు.కేసముద్రం పురపాలక సంఘం కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం(Indiramma Family Insurance Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాతో(Life Insurance) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని చెప్పారు.
ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా, ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. శ్రీనివాస రావు, కౌన్సిలర్లు దూఢపాక కృష్ణ,తరాల వీరేష్ యాదవ్,రావుల వినయ్ రెడ్డి, బానోత్ అరుణ కుమారి, జాటోత్ సుజాత,ఆగే రాము, అధికారులు పాల్గొన్నారు.