కార్తీక మాస శివ దీక్షలు పట్టుకున్న భక్తులు
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ మహదేవరాలింగ స్వామి దేవస్థానం(Swayambhu Mahadevaralinga Swamy Temple)లో ఆలయ ప్రధాన అర్చకులు శివ గురు స్వామి డాక్టర్ ఎర్ర హరికిషన్ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన 111 మంది శివ స్వాములకు శివ దీక్షను అందించారు.
తుంగతుర్తి గ్రామం నుండి 32 మంది, బండ రామారం గ్రామం నుంచి 15 మంది, గుండెపురి గ్రామంలో నుండి నలుగురు, వెంపటి గ్రామం నుండి 28 మంది, పస్తాల గ్రామం నుండి 20 మంది, పసునూరు నుండి 6గురు, గొల్లగూడెం నుండి ఇద్దరు, కోడూరు, కాశితండా, గానుగుబండ, తూర్పు గూడెం నుండి ఒక్కరొక్కరు శివదీక్షను స్వీకరించారు.
వీరందరూ మండల దీక్షను పూర్తి చేసుకుని డిసెంబర్ 19 & 20 తేదీలలో ఇరుముడి కట్టుకొని శ్రీశైల క్షేత్రం లో దీక్షా విరమణ చేస్తారు. గడచిన 23 సంవత్సరాలుగా తుంగతుర్తి మండల కేంద్రం నుండి వేలాదిమంది శివ స్వాములు దీక్షాధారణ చేశారు. వారందరూ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులై కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పారు. గ్రామ పెద్దలందరూ కూడా భక్తిశ్రద్ధలతో వారికి భిక్షను అందిస్తారు. ఈ కార్యక్రమంలో దశరథ, సోమన్న, రమేశ్, మధు, లింగన్న, వెంకన్న, ఎల్లయ్య, అనిల్, మల్లయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.